ఓ దేవా నా యాత్రలోనా
160
పల్లవి: ఓ దేవా నా యాత్రలోన నా తోడు నీవేనయ్యా(2)
నా నీడవై నన్నూ వీడక నడిపించు నా దేవా (2)
1 దుప్పి నీటీవాగుల కొరకు ఆశపడునట్లు
దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది (2)
నిత్యము నీ వాక్యమందు నిలిపి
నీ కృపలో నన్నుగావుమా (2) “ఓ దేవా ”
2 క్రమములేని నా బ్రతుకంతా శ్రమల పాలైపోగా..
కరుణ చూపి నన్ను నీవు వెలుగు తారగా చేసావు (2)
కడవరకు నీ ఆజ్ఞలందు నిలిపి
నీ కృపలో నను గావుమా (2) “ఓ దేవా ”