ఆ దేవుని మదిలో ఉన్నది నీవేనని
158
పల్లవి: ఆ దేవుని మదిలో ఉన్నది నీవేనని
తన కోరిక తీర్చే మనిషివి నీవేని
తన కోసమే నిన్ను చేసాడని ఆహాహాహా
తన మనసునే నీకు చెప్పలని
చెట్టు ఫలము నీకే – గర్భ ఫలము తనకే (2) “ఆ దేవుని”
1 ఈ సృష్టి చేసి ఆ దేవుడిస్తే – ఈ సృష్టినే దేవుడని కొలువ లేదా?
ఈసృష్టి చేసి నీ కోసమిస్తే – ఆదేవుడే తండ్రినీ తెలుసు కోవా?
నీ తండ్రే అతడని – నిన్నే కన్నడని
ఈ సృష్టి దూతలని గుర్తించలేవా ? “చెట్టు ఫలము నీకే”
2 ప్రతి పాపి కోసం ఆ యేసు వస్తే – ఆ యేసునే శిలుపై చంపలేదా (2)
నీ అన్నీ అతడని ప్రాణం పెట్టాడని రక్షించే నాధుడు గుర్తిచలేవా (2)
పాపివైన నీవే కావాలి నీవు తనకే “ఆ దేవుని”