నా తోడుగా ఉన్నావాడవే..
152
పల్లవి: నా తోడుగా ఉన్నావాడవే..నా చేయిపట్టి నడుపువాడవే(2)నా పక్షమున నిలుచువాడవే… (2)
నా దైర్యము నీవే యేసయ్యా (2)
యేసయ్యా..యేసయ్యా.. (2)
కృతాజ్ఞాత స్తుతులు నీకేనయ్యా (2) “నాతోడుగా”
1 నా అనువారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చెయ్యివిడిచిన(2)
ఏ క్షణమైన నన్ను మరువకుండా.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. (2)
నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే..(2) “నాతోడుగా”
2 నా పాదములు జారినవేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే (2)
నీ ఎడమ చేయి నా తలక్రింద ఉంచి..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. (2)
నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే.. (2) “నాతోడుగా”
3 హృదయము పగ్గిలే వేదనలోన కన్నీరుపొంగే పరిస్థితులలో (2)
ఒడిలోన చేర్చి ఓదార్చువాడా.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. (2)
కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే.. (2) “నాతోడుగా”