నా చెంత నుండుము
151
పల్లవి: నా చెంత నుండుము ఓ యేసయ్యా
నే నిన్ను విడిచి బ్రతక లేనయ్యా..(2)
హల్లెలూయా-హల్లెలూయా-హల్లెలూయ–హల్లెలూయా(2)
1 చీకటి సమయములో వెలుగులో నను నడుపు
మరణపు సమయములో జీవముతో నింపు (2)“నా చెంత”
2 కన్నిటి సమయములో తల్లిలా ఓదార్చు
కష్టముల సమయములో తండ్రిలా కాపాడు(2)“నా చెంత”
3 నీ వాక్యము చదివె సమయములో గురువుగా బోధించు
నే ప్రార్థించే సమయములో దైవంలా ఆలకించు (2)“నా చెంత”