ఒక్కక్షణమైన నిన్ను విడి
147
పల్లవి: ఒక్కక్షణమైన నిన్ను విడిఉండలేనయ్య నా యేసయ్య(2) యేసయ్య{4}
1 నశించిపోతున్న నను బ్రతికించివయ్య యేసు
కృషించి పోతున్న నాలో – వేంచేసినవయ్య యేసు (2)
నీ కార్యలేంతో - ఆశ్చర్యకరములయ్యా
నీ వాగ్ధానములేంతో నమ్మ దగినావయ్యా (2) యేసయ్యా{4}
2 మతిలేక తిరిగి నను – నీ దరిచేర్చినవయ్య యేసు
శ్రమ చేత నలిగిన నాకు - వరమిచ్చినవయ్యా యేసు (2)
నీ ఆలోచనలేంతో - లోతైన ధీవేనయ్యా
నీ తలంపులేంతో- మధురము నాయేసయ్యా (2) యేసయ్యా{4}