నీ గుండెలో ఆ చప్పుడే ఆగు
146
పల్లవి: నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా
ఆదేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడొ తెలుసా
దేవుని పని చేయుటకొరకే కాలం తెలుసా
ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా
పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుకో (2) “నీ గుండెలో”
1 ఎక్కువ కాలం బ్రతికవంటే ఎంతో పని ఉంది
తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది
నీ ప్రాణం ప్రియునికి కాదని ప్రాణమివ్వాలి ప్రభువుకేనని
నీ ప్రాణం నీదికదని ప్రాణమివ్వాలి ప్రభువుకేనని (2)
పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో “నీ గుండెలో”
2 దేవుడు చేసిన ప్రతి వస్తువుకి ఎంతో పని ఉంది
దేవుని పనినే నువు చేయ్యాలని నీ పని చేస్తుంది (2)
నీ జననం జరిగింది ఇందుకే ఈ ప్రకృతి చేసాడందుకే
పని ఉందనే మనిషిలో ప్రాణముందని తెలుసుకో “నీ గుండెలో”