నడిపిస్తాడు నా దేవుడు
122
పల్లవి: నడిపిస్తాడు నా దేవుడు-శ్రమలోనైన నన్నువిడువడుఅడుగులు తడబడిన - అలసట పైబడిన (2)
చేయి పట్టి వెన్ను తట్టి - చక్కని అలోచన చేప్పి “నడిపిస్తాడు”
1 అందకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగ దీసినా (2)
తన చిత్తం నేర వేర్చుతాడు - గమ్యం వరకు నన్ను చేర్చుతాడు (2) “నడిపిస్తాడు”
2 కష్టాలు కొల్లిమి కాచ్చివేసినా -శోకాల గుండెను చీల్చివేసినా (2)
తన చిత్తం నేర వేర్చుతాడు -గమ్యం వరకు నన్నుచేర్చుతాడు (2)
3 నా కున్న కల్లిమి కరిగిపోయినా-నా యొక్క బల్లిమి తరిగిపోయినా (2)
తన చిత్తం నేర వేర్చుతాడు-గమ్యం వరకు నన్నుచేర్చుతాడు (2) “నడిపిస్తాడు”