క్రీస్తు సాక్షిగానే వుంటున్నావా
121
పల్లవి: క్రీస్తు సాక్షిగానే వుంటున్నావానీదు సాక్ష్యము నిలుపు కుంటున్నావా (2)
అన్య జనుల మధ్యలో క్రీస్తు మధుర నామము (2)
నీ వలన దూషింప బడుచున్నదా
నీ క్రీయల వలన అవమనము పోందుచున్నదా (2) “క్రీస్తు”
1 యౌవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమందు
యోహోవాను ఘనపరిచాడు (2)
ఫోతి ఫరు భార్యయొక్క కామ క్రోధ శ్రేష్టలకు (2)
ఎమాత్రం లొంగనానాడు
తన సాక్ష్యము నిలుపుకున్నాడు (2) “క్రీస్తు”
2 చెరలోనున్న యూదదాసి
సిరియ దేశమందు యెహోవాను ఘనపరిచింది(2)
కుష్టరోగి నయమాను షామ్రెనుకు వెళ్ళమంది(2)
ఎలిషా ప్రవక్త యొద్దకు తన సాక్ష్యము నిలుపుకున్నాడు(2)
3 దైవజనుడు దానియేలు
బబులోను దేశమందు యెహోవాను ఘనపరిచాడు(2)
తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు(2)
ఏ మాత్రం మ్రొక్కనన్నాడు
తన సాక్ష్యము నిలుపుకున్నాడు(2) “క్రీస్తు”