తల్లి మరచిన తండ్రి విడిచిన
116
పల్లవి: తల్లి మరచిన తండ్రి విడిచిన మరువాని వాడే దేవుడునీన్నువిడువాని వాడే దేవుడు (2)
చల్లగా చుస్తాడు దీవెనలిస్తాడు
దీవెన లిస్తాడు సంతోషం ఇస్తాడు (2)
1 ఏ సమయమందైన ఏ స్ధతిలో నీవున్న
కునుకాక నీద్రించక నీ వెంటే ఉంటాడు (2)
మనుస్సు మార్చుకో యేసుని హృదిని చేర్చుకో (2)
నీ బ్రతుకు మారుతుంది నీ బరువు తిరుతుంది “తల్లి”
2 దేవుడు లోకాన్ని ప్రేమించేను
ప్రేమించి తన పుత్రుని మనకిచ్చెను (2)
యేసు నిజా దైవమని నిజం తెలుసుకో (2)
నీ హృదిని చెర్చుకో నీ బ్రతుకు మార్చుకో (2) “తల్లి”