సృష్టిని చూడన్నో ఎంతో బాగుంది
115
పల్లవి: సృష్టిని చూడన్నో ఎంతో బాగుంది- ఎవరు చేసిరి ఆది ఎల్లా కలిగెను
చిత్రం చిత్రం చిత్రం చిత్రం ఎంతో చిత్రం అది ఎంతో విచిత్రం (2)
1 భూమిని చూడన్నో - భూ ఫలం చూడనో
సూర్యుని చూడు చంద్రుని చుడు
గాలిని చూడు నీరును చూడు“ఎవరు చేసిరి”
2 పక్షులు చూడన్నో ప్రాకు పురుగును చూడన్నో(2)
చీమలు చూడు చిలకలు చూడు
మనిషి మనిషికి తేడా చూడు “ఎవరు చేసిరి”
3 బైబిల్‍ చదువన్నో - నీ బాధలు తీరును (2)
సత్య దేవుడు నిత్య దేవుడు
ఏ పాప మెరుగని యేసు దేవుడు
సృష్టిని చేసెను విచిత్రం గుండెను (2) “చిత్రం చిత్రం ”