ప్రకటింతును నీ సువార్తను
113
పల్లవి: ప్రకటింతును నీ సువార్తను - సకల జనులకు సహనముతోసత్యవాక్యము ధ్యానించుచు - సమయమునందు అసమయమునందు
1 లోకము నన్ను ద్వేషించినా – లోకులు నన్ను దూషించిననా (2)
నా వారే నన్ను నిందించినా- నా ప్రియులే నన్ను విడనడినా
నిందలు మోపి హింసలు పెట్టిన ప్రకటింతును నీ సువార్తను “ప్రకటింతు”
2 తల్లి దండ్రులు తరిమేసినా - అన్నదములు త్రోసిచేసినా
కదలక యేసుని అడుగులలో- తడబడకుండా నడిచేదను
ప్రాణము నాలో ఉన్నంతవరకు - ప్రటింతును నీ సువార్తను “ప్రకటింతు”
3 ఆత్మ రక్షణ కొరకై నేను - అలయక ముందుకు సాగెదను
అంతము వరకు ప్రటింతును - అసువులు బాపిన ప్రభుయేసును
హత సాక్షలలో చేరుటకై - కలవరమొందెద సుర్తకై “ప్రకటింతు”