జుంటి తేనే ధారల కన్న యేసునామమే
91
పల్లవి: జుంటి తేనే ధారల కన్న యేసునామమే మధురంయేసయ్య సన్నిధినే మరువ జాలను (2)
జీవింతకామంతా ఆనందించేదా యేసయ్యనే ఆరాధించేదా (2)“జుంటి తేనే ”
1 యేసయ్యా నామమే - బహు పూజనీయము
నాపై దృష్ట నిలిపి సంతృష్టగా నన్ను ఉంచి (2)
నన్నేంతగానో దీవించి జీవ జలపు ఊటలతో ఉజ్జహింప జేసేనే (2) “జుంటి తేనే ”
2 యేసయ్య నామమే బలమైన ధుర్గము
నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి (2)
నన్నేంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింప జేసేనే (2) “జుంటి తేనే ”
3 యేసయ్యనామే పరిమళ తైలము
నాలో నివాసించి సువసనగా నన్ను మార్చి(2)
నన్నేంతగానో ప్రేమించి విజయోత్సవలతో ఊరేగింప జేసేనే (2) “జుంటి తేనే ”