చిరకాల స్నేహితుడా
89
పల్లవి: చిరకాల స్నేహితుడా- నా హృదయాన సన్నిహితుడా (2)
నా తోడు నీవయ్య – నీ స్నేహం చాలయ్య
నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా యేసయ్యా (2)
చిరకాల స్నేహం- ఇది నా యేసు స్నేహం “చిరకాల
1 బందువులు వెలి వేసినా- వెలి వేయని స్నేహం
లోకాన లేనాటి ఓ దివ్య స్నేహం- నా యేసు నీ స్నేహం (2) “చిరకాల
2 కష్టాలలో కనీళ్ళలో- నన్ను మోయునీ స్నేహం
నన్ను ధైర్య పరిచి ఆధరణ కలిగించు- నా యేసు నీ స్నేహం (2) “చిరకాల
3 నిజమైనది విడువనిది- ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ శిలువ స్నేహం- నా యేసునీ స్నేహం (2) “చిరకాల