ఆ దేవుడే నీ తండ్రని నేర్పాలి
87
పల్లవి: ఆ దేవుడే నీ తండ్రని నేర్పాలి తల్లితండ్రి ఒడిలోఆ దేవుడే సృష్టి చేసాడని నేర్పాలి ఆ చిన్నిమదిలో
కూర్చున్నపుడే త్రోవను నడిచేటపుడే
పడుకోన్నపుడే నిద్రలేచేటపుడే
దేవుని గూర్చిన జ్ఞానం నేర్పించుము
నీ గర్భంలో ఉన్నపుడే వినిపించుము “ఆ దేవుడే”
1 తల్లే దైవమని ..తండ్రే దేవుడని…
గురువే దైవమని పాఠలేచెప్పకు (2)
తల్లి తండ్రి గురువును చేసింది ఆ దేవుడే
దేవుని కంటే ముందు వీరెవరు లేరులే
గాలి నీరు ఆహారం ఎవరిచ్చారు (2)
నీ తల్లి నడిగి తండ్రినడిగి గురువు నడిగి చెప్పు “ఆ దేవుడే”
2 ధనమే దైవమని -చదువే ధ్యేయమని
పతియే దైవమని పాఠాలే చెప్పకు (2)
సతిని పతిని చేసింది దేవుడని తెలుసుకో
దేవుని కంటే ముందే లేరెవరని తెలుసుకో
గాలి నీరు ఆహారం ఎవరిచ్చారు(2)
నీ సతిని అడిగి నీ పతిని అడిగి అతిధి నడిగిచెప్పు “ఆ దేవుడే”
3 (A)ఎ ఫర్ ఆల్‌మైటీ
(B)బి ఫర్ బైబిల్
(C)సి ఫర్ క్రైస్ట్
(D)డి ఫర్ డాడీ
యువర్ డాడీ యువర్ డాడీ యువర్ డాడీ ఆ దేవుడే…