కను చూపు మేరలోన
86
పల్లవి: కను చూపు మేరలోన ఏ ఆశలేని వేళఎటు తోచక లోలోన నే కృంగీయున్న వేళ(2)
నేనున్న నీతో అంటు నా చెంతకు చేరావు
నా కన్నీరంత తుడిచి నీ కౌగిట దాచావు(2) “కనుచూ”
1 మొదలు పెట్టిన కార్యం- మధ్యలో ఆగిపోగా
బెదెరి పోయి నా హృదయం- వేలగా మారిపొగా (2)
పనిపూర్తి చేయగా- బలము లేని వేళ (2)
నేనున్నా నీతో అంటు- నా చెంతకు చేరావు
నా ఆటంకలనిటిని - యేసు తోలగించావు (2) “కనుచూ”
2 శ్రమలు తెచ్చిన ధుర్గం- శాంతిని దోచుకోగా
చెదిరి పోయిన ఆశలు సౌధం - నా గొంతు మూగబోగా (2)
స్తుతి పాట పాడగా- స్వరము రాని వేళ (2)
నేనున్నా నీతో అంటు- నాచెంతకు చేరావు
నా నోటను నూతన గీతము- యేసు పలికించావు (2) “కనుచూ”
3 కఫట మిత్రుల మోసం- అగ్నిల కాల్చబోగా
సడలిపోయిన విశ్వాసము- ధైర్యమె లేక పోగా (2)
అడుగేసి సాగగా- అణువు గానీ వేళ (2)
నేనున్న నీతో అంటు- నా చెంతకు చేరావు
నా ప్రార్ధనకు ఫలమిచ్చి- యేసు నడిపించావు (2) “కనుచూ”