యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి
85
పల్లవి: యేసు నీ కార్యములు ఎంతో గొప్పవితండ్రి నీ తలంపులు లెక్క లేనివి (2)
కంటికి కనబడవు హృదయానికి అంతు చిక్కవు (2) “యేసు”
1 కాన విందులో ఒకే మాటతో అద్భుతం చేసితివి
చేప కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి (2)
అవి కంటికి కనబడవు హృదయానికి అంతు చిక్కవు(2) “యేసు”
2 షద్రకు మేషాకు అబేద్నెగోలతో అగ్నిలో నిలిపితివి
దానియేలుకు సింహపు భోనులో విజయం నిచ్చితివి (2)
అవి కంటికి కనబడవు హృదయానికి అంతు చిక్కవు (2) “యేసు”
3 పౌలు సీలలు పార్ధించగా చెరసాలు బ్రద్ధలాయేనే
గొర్రేల కాపరి దావీదును రాజును చేసితివి (2)
అవి కంటికి కనబడవు హృదయానికి అంతు చిక్కవు(2) “యేసు”