జీవితంలో నీలా ఉండాలనీ
84
పల్లవి: జీవితంలో నీలా ఉండాలనీ
యేసు నాలో ఎంతో ఆశున్నది (2)
తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చెంత? “జీవితంలో”
1 పరిశుధ్దతలో ప్రార్ధించుటలో -
ఉపవాసములో ఉపదేశములో(2)
నీలోనే చేరాలనీ నీతోనే గడపాలనీ (2)
నీలాగే చేసి నీతోనే నడిచి నీ దరికి చేరాలనీ ఓ… “తీరునా”
2 కూర్చండుటలో నిలుచుండుటలో -
మాట్లడుటలో ప్రేమించుటలో
నీ లాగె ఉండానీ నీ చిత్తం నెర వేర్చనీ(2)
నీలాగే బ్రతికి నీ తోనే నడిచి నీ దరికి చేరాలనీ ఓ.. “తీరునా”