నీ నామం స్తుతియింతును
83
పల్లవి: నీ నామం స్తుతియింతును ఓ విజయ శీలుడానీ వాక్యము ద్యానింతును ఉన్నంతకాలము (2)
నీ ప్రేమను ప్రకటింతునయ్యా జీవింతాంతము (2)
నా బలమా నా యేసు నాకున దైవమా (2) “నీ నామం”
1 కష్టసాగరము నన్ను చుట్టు ముట్టిన
కటిక చీకటి నన్ను ఆవరించినా (2)
నా కంటి నీరు తుడిచి నన్ను ఆదరించుమా (2) “నా బలమా”
2 ఎంతసహానమో నీకు సహానశీనుడా
మాకు నేర్పుము నీ దివ్యగుణములు (2)
మా జీవితాలు మలచి నిన్ను పోలి నడువాగా (2) “నా బలమా”
3 శాంతి నిచ్చినావు శాంతి రూపుడా
భరమంత మోయుచున్న మంచిదేవుడా (2)
ఎంత ప్రేమ నాపైన నా మంచి దేవుడా (2) “నా బలమా”