సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము
78
పల్లవి: సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును
1 అబ్రామును అడిగెనుప్రభువపుడు
ఇస్సాకును ఆర్పణగా ఇమ్మని
నీ బిడ్డను సేవకునిచ్చెదవా నీ విచ్చెదవా “సమర్పణ”
2 ప్రియము దేవునికి హేబేలు బల్లి హేయము
కయీనుని అర్పణము కళంకము
కల్మష మంటనివి నీ విచ్చెదవా “సమర్పణ”
3 అయిదు రొట్టెలు చేపలు రెండు
అయిదు వేలకు ఆహారముగా అర్పించెను
బాలుడాకటి వేళ అట్లిచ్చెదవా “సమర్పణ”
4 ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెన్ కానుకగా
జీవన మంతయు దేవునికిచ్చెన్ నీ విచ్చెదవా “సమర్పణ”
5 నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలసిన మందిరము
సజీవ యాగముగా నిచ్చెదవ నీ విచ్చెదవా “ఇమ్మనేను“ “సమర్పణ”