ఈ భూమి పై బ్రతుకు ఏముందనీ
77
పల్లవి: ఈ భూమి పై బ్రతుకు ఏముందనీ
మరణించినంత వరకే ఉంటుందని
పరలోకంమందే బ్రతుకుందని
ఈబ్రతుకు తోనే ముడి వుందని
నీ రాకకై దేవుడెన్నెన్నో నీకు చేసేను
పరలోకమే తండ్రి పని చేసి దాన్ని పొందుము “ఈ భూమి”
1 ఈ తనువుతో దావీదులా ఆదేవుని ఉద్దేశము నెరవేర్చుము
ఈతనువుతో మోషే వలే తన ఇంటిలో నమ్మకముగా పని చేయుము
నీ దేహమే వదిలి వెళుతోంది ఏదో క్షణం
ఆక్షణముతో ముగిసి పోతోంది నీ జీవితం “ఈ భూమి”
2 ఈ తనువుతో నోవహాలా ఈ రక్షణ సువార్తను ప్రకటించుము
ప్రభు యేసుకే నీ జీవితం అర్పిచితే మరిణించినా నిన్ను లేపును
పరలోకమే తండ్రి పని చేసి దాన్ని పొందుము “ఈ భూమి”