కట్టెలపై నీ శరీరం
75
పల్లవి: కట్టెలపై నీ శరీరం - కనిపించదు గంటకు మళ్ళీమట్టిలోన పెట్టిన నిన్నే - గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా - కట్టె మిగిల్చింది కన్నిటిగాధ (2)
1 దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)
కన్న తండ్రిన్నే మరిచి కాటికెళ్ళి పోతావా
నత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) “ఎన్నిచేసినా”
2 ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
కన్న వారే ఉన్ననూ - కట్టుకున్నవారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ - ఆత్మవెళ్లిపోవును (2) “ఎన్నిచేసినా”