ఏ రీతి స్తుతియింతును దేవుని
66
పల్లవి: ఏ రీతి స్తుతియింతును దేవుని ఎనలేని ఆ ప్రేమను(2)పాపినైన నా కోరకు యేసు ప్రాణమిచ్చిన ఆ సిలువ ప్రేమను (2) “ఏరితి”
1 తన రూపములో నరుని సృజించి -తన నామములో జీవము నోసగి(2)
తన వారసులను చేసేను యేసు- తన కుమారులుగా పిలచేను మనలను (2)
ఏమి చెల్లింతు ఆ పరమ ప్రేమకు(2) “ఏరితి”
2 మన పాపముకై సిలువను మోసి- కలవరి సిలువలో శ్రమలు సహించి(2)
మన మరణమునే పొందిన యేసు- తన జీవమునే నొసగేను మనలను(2)
ఏమి చెల్లింతూ ఆ మర ప్రేమకు (2) “ఏరితి”