ఫలియించి ఫలములు పంచెదం
62
పల్లవి: ఫలియించి ఫలములు పంచెదం
వెలిగించి వెలుగును నింపెదం (2)
యేసు సాక్షిగా కాంతి రేఖగా (2) “ఫలియించి”
1 పచ్చని మొక్క యేసేపువలె
కొమ్మలు రెమ్మలు పండెను నిండుగా (2)
యేసు కై బహుకై ఫలించెదాము
అందరి ఆకలి తీర్చెదము (2) “యేసు సాక్షి”
2 చక్కని చుక్క ఎస్తేరు వలె
ధగ ధగ మెరియించు కాంతులు నిండుగా (2)
యేసుకై బహుగా వెలిగెదము
అందరి చీకటి తీసెదము (2) “యేసు సాక్షి”