నా స్వరం దేవా నీ వరం
59
పల్లవి: నా స్వరం దేవా నీ వరంనా గానం దేవా నీ కోసం (2)
హల్లెలుయ్యా … హల్లెలుయ్యా …హల్లెలుయ్యా
1 నాలోని గొప్పదనం నీ నుండి వచ్చినది
నా కున్న జ్ఞాన ధనం నీవేగా ఇచ్చినది (2)
నేను నీ వాడను నీలోన తీగను
నీ కొరకు నిత్యం ఫలియించు చుందును “నాస్వరం”
2 నా పాట ప్రతి పధం నీవు వ్రాయించినది
నా చేత సంగీతం నీవు చేయించినది (2)
నీ ఘనత చాటను ఏపాటి వాడను (2)
శ్రమలతో సైతం స్తుతియించుదును (2) “నాస్వరం”
3 నా మీద అభిషేకం నీవు పంపించినది
నా లోన సంతోషం నీవు పుటించినది (2)
ఏ విదము చేతను నీ ఋణము తీరును (2)
నీ మహిమ కోసం పనిచేయు చుందును (2) “నాస్వరం”