నాకు చాలిన దేవుడవు
54
పల్లవి: నాకు చాలిన దేవుడవు - నీవే యేసయ్యా
ఎవరు వర్ణింప లేరయ్యా - నీ ప్రేమను యేసయ్యా
స్తోత్రము యేసయ్యా -స్తుతి స్తోత్రము యేసయ్యా (2)
1 నా జీవము నీలో- దాచియున్నావు (2)
నా ప్రతి అవసరము- నీ మహిమలో చూపావు (2)
స్తోత్రము యేసయ్యా -స్తుతి స్తోత్రం యేసయ్యా (2) “నాకు”
2 వెలుపల లోపల నాకు- నీవు తోడుడై యున్నావు (2)
సాతాను దుర్గలను - నా కాళ్ళకింద యుంచావు (2)
స్తోత్రం యేసయ్యా -స్తుతి స్తోత్రం యేసయ్యా (2) “నాకు”
3 అమూల్యమైనవి నాకు-నీవు వాగ్ధానము చేసావు
పన్నెండు గుమ్మలతో- నా ఇల్లును కట్టావు (2)
స్తోత్రము యేసయ్యా- స్తుతి స్తోత్రం యేసయ్యా (2) “నాకు”