ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి
53
పల్లవి: ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి- నెమ్మది నెమ్మదియేఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా - ఆనందమానందమే (2)
ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధన - ఆరాధన “ప్రియుడా”
1 నీ శక్తి కార్యముల్ తలచి తలచి- హృదయాలు పొంగెనయ్యా
మంచివాడా మంచి చేయువాడా - స్తోత్రము స్తోత్రమయ్య (2)
మంచివాడా మహోన్నతుడా - ఆరాధన ఆరాధన (2) “ప్రియుడా”
2 బలిమైన గొర్రెగా పాపము నంతయు - మోసి తీర్చతివే
పరిశుధ రక్తము నా కోరకేనయ్యా - నా కెంతో భాగ్యమయ్యా (2)
పరిశుధుడా పరత్మడా - ఆరాధన ఆరాధన (2) “ప్రియుడా”
3 ఎన్నెన్నొ ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన - నిన్నునే విడువనయ్య
నీరక్తమునకు సాక్ష్యముగా నుందును - నిశ్చయం నిశ్చయమే(2)
రక్షకుడా యేసు నాధా -ఆరాధన ఆరాధన (2) “ప్రియుడా”