ఏదేను తోటలో ఆదాము హవ్వలు
49
పల్లవి: ఏదేను తోటలో ఆదాము హవ్వలుప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరగని స్థితిలో
ఆజ్ఞాను అతిక్రమించి-అపవాది మాటను పాటించి
తప్పుచేశారు తప్పు తండ్రిపై నెట్టివేశారు
చేట్టు వేయుటే నేరమా?
దేవుడు ముందుగా చెప్పకుండెనా? (2)
తెలుసుకో దీనిరహస్యం చేట్టులోనే ఉంది పరమార్దం (2)“ఏదేను”
1 చెడు చేయడానికవకాశముండి-చెడుచేయనివాడు గొప్పవాడా?
చెడు చేయడానికవకాశమేలేక-చేయనివాడు గప్పవాడా?
నీ గొప్ఫతనాన్ని నిరూపించుకో
మంచి చెడులు యోచించి తెలుసుకో “చేట్టు వేయుటే”
2 మంచివాడివని నిరూపించుటకు పరీక్ష ఉండాలి
గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి
చెడుచేయకయండనే చెడును తెలుసుకో
దైవలక్షణముందని ఋజువు చెసుకో
చెట్టువున్నా ఫలము తిననివాడే గోప్పవాడు
చెట్టువేయకుంటే నీ గొప్పతనానికి అర్దం లేదు. “తెలుసుకొ”