తండ్రియైన దేవునికి పిల్లలు కావాలి
48
పల్లవి: తండ్రియైన దేవునికి పిల్లలు కావాలి
అందుకే వివాహం ఘనమైనది
స్త్రీ పురుషుల కందుకే పెళ్ళికావాలి (2)
ఈ భూమిని నిండిచాలి -తనకలలను పండించాలి (2)
ఎందుకో మనిషికి తెలియకున్నది
తండ్రియైన దేవుని అనాది సంకల్పమని “తండ్రియైన”
1 నేలమంటి నుండి దేవుడు నరుని చేసెను
గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని తీసెను (2)
మీరు ఫలించి భూమిని నిండించి
సృష్టినంత ఏలమని వారికిచ్చెను (2)
తన పోలికతో మీరు కనాలని
తన రూపంలో తనకు కావాలని(2)
దైవజ్ఞానమందు వారిని తీర్చిదిద్దాలని “ఎందుకో”
2 పెళ్ళియైన వారికందరూ బహుమతులిస్తే
గర్భఫలం దేవుడిచ్చు బహుమానమే (2)
దేవుడు లేడనే వారితో మీ పిల్లలు వాదించి
దేవుడున్నాడని రుజువు చేయాలి
మీ పిల్లలు నీలాగె పెంచాలని
మీ పిల్లలు ఈలాగె పెరగాలని
తండ్రిగూర్చి తెలుపుటకే క్రీస్తు జన్మించెను
ఎవరికి తెలుసు ఆ తండ్రి మనసు
తన కోసం మనలను కన్నాడని “ఎందుకో”