ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా
42
పల్లవి: ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా
నిను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా
నిను రక్షించు వాడు యేసయ్యేనని సత్యం తెలియునా
1 నీవు నమ్మినవారే మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ సోంతజనులే నీ ఆశల మేడలు అన్నియు కూల్సినా
ఊహించనివి జరిగినా - అవమాన మిగిలినా
నిను ఓదార్చె వారొకరున్నారని వాస్తవం తెలియునా
నీ స్ధితిమార్చవాడు యేసయ్యేనని సత్యం తెలియునా“ఓ నేస్తమా”
2 నీ కష్టార్జితము అన్యాయము చేయువారికే దక్కినా
నీకున్న స్వాస్ద్వము దోపిడి దారుల చేతికే చిక్నినా
ఉద్యోగమే ఊడినా - వ్యాపారంలో ఓడినా
నిను ఓదార్చే వారొకరున్నారని వాస్తవం తెలియునా
నీ స్ధితి మార్చూవాడు యేసయ్యేనని సత్యం తెలియునా “ఓ నేస్తమా”