జయ శీలుడా నా యేసయ్య
41
పల్లవి: జయ శీలుడా నా యేసయ్య - జీవించు వాడా మెస్సయ్యజయ మిచ్చు వాడా స్తోత్రము - మా ప్రాణ ప్రియుడా వందనం
ఆ…. ఆ…హల్లెలూయ్యా (2)
1 బలమిచ్చు వాడా బలవంతుడా
శక్తి నిచ్చు వాడా శక్తి మంతుడా
తృప్తి నిచ్చు వాడా తనయులకు (2)
ముక్తి నిచ్చు వాడా మృత్యుంజయుడా (2)
మాకై …. మరలా …. రానుంటివా “యేసయ్య” “హా”
2 ఆదియు అంతము నీవేగ ఆరాధ్యుడవు నీవేగా
అత్యున్నతుడా ఆతి ప్రియుడా (2)
సత్యస్వరూపి ఆశ్రయుడా (2)
అను క్షణం నిన్నే కీర్తింతును “యేసయ్య” “హా”
3 నీవే దిక్కాని నమ్మితిని
నిన్నే గురిగా - నీవే నాకు తల్లివి (2)
నీకు సమాస్తము సాధ్యమే (2)
నీపై సర్వం మోపితిని - నీపై నా భారం మోపితిని “యేసయ్య” “హా”