కుతూహలమార్భాటమే
34
పల్లవి: కుతూహల మార్భాటమే - నా యేసుని సన్నిదిలోఆనందమానందమే నా యేసుని సన్నిదిలో (2)
1 పాపమంత పోయెను -రోగమంత తొలిగెను యేసుని రక్తములో
క్రీస్తు నందు జీవితం -కృపద్వార రక్షణ పరిశుద్ధ ఆత్మతో(2) “కుతూహల”
2 దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే- దేవాలయము నేనే
ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుత అద్భతమే (2) “కుతూహల”
3 శక్తినిచ్చుయేసు జయమిచ్చు యేసు- జయములపై జయమిచ్చును
ఏకముగకూడి హోసన్న పాడి- ఊరంత చాటేదము (2) “కుతూహల”
4 బూరధ్వనితో పరిశుద్దులతో యేసు రానైయుండె
ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేసించేదాం (2) “కుతూహల”