తల్లిల లాలించును
35
పల్లవి: తల్లిల లాలించును తండ్రిల ప్రేమించునుముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్ధాడును
కంటి పాప వలె కాపాడును యేసయ్యా “తల్లిల”
1 తల్లియైన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2)
నీ పాదములు తొట్రిల నియ్యను నేను
నిన్ను కాపాడు వాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్ధానం చెసిన యేసయ్య “తల్లిల”
2 పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్ని
వీడిపోదు నా కృప నీకు నా నిబంధన తొలగదు (2)
దిగులు పడకు భయపడకు నిన్నువిమోచించెందా
నీదు భారమంత మోసి నాదు నా శాంతి నొసగెద
అని చెప్పి వాగ్ధానం చేసిన యేసయ్య “తల్లిల”