శృతి చేసినే పాడనా
30
పల్లవి: శృతి చేసినే- పాడనా స్తోత్ర గీతంభజియించి నే పొగడనా - స్వామి “హల్లెలూయ్యా” {5}
1 దాని యేలును సింహపు బోనులో
కాపాడినది నీవేకదా
జలప్రళయములో నోవాహును కాచిన
బలవంతుడవు నీవేకదా “హల్లెలూయ్యా”
2 సమరయ్య స్త్రీని కరుణతో బ్రోచిన
సశ్చ రీతుడవు నీవేకదా
పాపుల కొరకై ప్రాణము పెట్టిన
కరుణమయుడవు నీవేకదా “హల్లెలూయ్యా”