ఆధారం నాకు ఆధారం
28
పల్లవి: ఆధారం నాకు ఆధారంనాకు తోడు నీడైవున్న నీ కృపయే ఆధారం
ఆశ్రయము నాకు ఆశ్రయము
ఆపాత్పాకలంమందు ఆశ్రయము నీ నామం ఆశ్రయము (2)
తల్లి తండ్రి లేకున్న బంధుజనము రాకున్న
లోకమంత ఒకటైన భాధలిన్ని బందువులైన “ఆధారం”
1 భక్తి హీన బంధములో నేనుండగా
శ్రమల సంద్రములో పడివుండగా ఆ..ఆ..ఆ(2)
ఇరుకులో విశాలతను కరిగించిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో - నను చేర్చగా రావా “ఆధారం”
2 దారి తప్పి సుడినుండి - ఐశ్వర్యపు తీరానికి
నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా ఆ..ఆ..ఆ (2)
విడువను ఎడబాయననీ - పలికిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో - నను చేర్చగా రావా “ఆధారం”
3 దిగులు పడిన వేళలలో- ధరిచేరిన నా దేవా
అవమానపూ చీకటిలో- బలచ్చిన నాదేవా (2)
చీకటిలో వెలుగువై -నడిచొచ్చిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో -నను చేర్చగా రావా (2) “ఆధారం”