దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం
27
పల్లవి: దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషంఆ సిలువ నీడలో సంపూర్ణ క్షేమము (2)
నా క్రీస్తులో దోరుకునులే నిత్యజీవము
నా యేసులో దోరుకునులే నిత్యనాందము (2) “దేవుని”
1 రాజులను అధికారులను - నమ్ముకోనుట కంటే
నా యేసుని నమ్మటలో - నా జీవిత ధన్యకారం (2)
నా యేసు సన్నిది- అదే నాకు పెన్నిది (2)
తోడుగా నీడగా- నను నడించునులే
జీవము జీవకిరీటము- నా యేసులో దోరుకునులే (2) “దేవుని”
2 కునుకడు నిద్రపోడు- నా దేవుడు ఎన్నడు
కంటికి రెప్పవలె-నను కాచి కాపాడును (2)
నా మంచి కాపరి-నా మేసయ్య
నీవే నా ఊపిరి- నా యేసయ్యా (2)
కరువైన కారు చికటైన - భయమిక లేదులే
కరుణించి తన కృప చూపి- నను నడిపించులే (2) “దేవుని”