బ్రతుకు బండికి సుఖదుఃఖాలే చక్రాలు
16
పల్లవి: బ్రతుకు బండికి సుఖదుఃఖాలే చక్రాలు
దేవుడే జతపరచిన వరలు
ఏ చక్రం లేకుండా బండి పోవునా
సుఖదుఃఖాలు లేక బ్రతుకు సాగునా
నీ బ్రతుకు సాగునా “బ్రతుకు”
1 సుఖదుఃఖా లిచ్చటే కలిసుండును
చావుతోనే రెండును విడిపోవును
ఓర్పు సహనతో భక్తిని సాగిస్తే
ఆ దేవుని సేవలో తనువును చాలిస్తే
పరలోకంలో ఫలం-ప్రభు చెంతనే మనం
నిలిచియుందుము కల కలము (2) “బ్రతుకు”
2 క్రైస్తవ జీవితమే పోరాటము
బ్రతకడానికెందుకింత ఆరాటము
శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు
హింసలు లేకుంటే పరలోకం రాదు
కష్టాల కలిమిలో ఇబ్బందుల కొలిమిలో
పరీక్షించును నిను దేవుడు (2) “బ్రతుకు”