ఎవరెవరి కొరకు ఆలోచించుచున్నారు?
12
పల్లవి: ఎవరెవరి కొరకు ఆలోచించుచున్నారు?బార్యలకై భర్తలా? పిల్లలకై తండ్రులా?
ప్రజల కొరకు మంత్రులా? మృతులకై సజీవులా?
ఎవరాత్మ కొరకు వారు ఆలోచించక
చనిపోయిన వారికై సంతాపసభలా? జ్ఞాపకార్ధ కూడికలా? “ఎవరెవరి”
1 నా యిష్టం నా కష్టం అంటున్నావు
నీ దేవుని యిష్టాన్ని ఎరుగకున్నావు (2)
కష్టించి పనిచేసిన దేవునినే మరచి
క్షణికమైన సుఖముకై బ్రతుకుచుంటివా
నీ కొరకై బలియైన క్రీస్తునే మరచి
మృతులైన వారికై యోచిస్తావా? “ఎవరెవరి”
2 బంధుత్వపు బంధంలో బంధీవైనావా
అంధత్వపు అంధునిగా బ్రతుకుచున్నావా (2)
నీకిచ్చిన కాలమే ముగియునని తెలిసి
సంపాదన సందడిలో తేలుచున్నావా?
నీ ఆత్మ కట్టె వీడక ముందే నరకానికి జారకముందే
ఇదే అనుకూల సమయము స్వీకరించు నేడే యేసుని “ఎవరెవరి”