మనిషీ ఓ మనిషీ
13
పల్లవి: మనిషీ ఓ మనిషీ ఓ మనిషీ నీవెవరుయాక్టర్వైనా, డాక్టర్‌వైనా మంత్రివైనా ధనవంతుడివైనా
బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి. “మనిషి”
1 మనిషీ పుట్టింది ఒకని నుండే
మరణమొచ్చింది ఆ ఒకని నుండే
మనుషులంతా ఒక్కటే
అందరి దేవుడు ఒక్కడే “యాక్టర్‌వైనా”
2 కులమే లేదు మతమే లేదు
ప్రాంతియ తత్వమే లేనేలేదు
మొదటి మనిషికి లేదు కులం
మనిషిని చేసిన దేవుని దే కులం “యాక్టర్‌వైనా”
3 మనిషికి పుడితే మనుష్య కుమారుడు
రాజుకు పుడితే రాజకుమారుడు
దేవునికి పుడితే దైవకుమారుడు
మనుష్యులంతా దైవ కుమారులే“మనిషి”