బ్రతికి చస్తావా - చచ్చి బ్రతుకుతావా
11
పల్లవి: బ్రతికి చస్తావా - చచ్చి బ్రతుకుతావా
ఇదే బ్రతుకు అనుకొని- భ్రమపడుచున్నావా
చచ్చి బ్రతుకుతుంది ప్రతి విత్తనం
నీవు విత్తినది చచ్చి బ్రతుకుచుండగా
నీకు బ్రతుకులేదన్నది ఎవడురా?
మరో బ్రతుకు లేదన్నది ఎవడురా? “బ్రతికి”
1 గొంగలి తన రూపం మార్చుకున్నది
సీతాకోక చిలుకగా ఎగురుచున్నది
ఆ రూపము కొరకే దాచుకున్నది
ఆ రూపము కొరకే కలలుకన్నది
సృష్టిలో ప్రధముడా?దేవుని కుమారుడా?
నీకు బ్రతుకులేదన్నది ఎవడురా?
మరో బ్రతుకు లేదన్నది ఎవడురా? “బ్రతికి”
2 ప్రతి చెట్టు పెరుగుచున్నది నీకోసమే
ప్రతి జీవి బ్రతుకుచున్నది నీకోసమే (2)
బ్రతికి బలౌతుంది నిన్ను బ్రతికించుట కొరకే
బ్రతకాలి నీవు దేవుని కొరకే !
చావే ముగింపు కాదని - ఆత్మకు చావు లేదని (2)
ప్రకటించి మరణించి తిరిగిలేచెను
సజీవుడైనాడు శకపుషుడైన క్రీస్తుయేసు “బ్రతికి”