గర్భఫలము దేవుడిచ్చు బహుమానం
10
పల్లవి: గర్భఫలము దేవుడిచ్చు బహుమానంకుమారులు యోహోవా ఇచ్చు స్వాస్ధ్యము
నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము
వెలలేని విడిపోని తన ప్రేమ బంధము (2) “గర్భఫము”
1 పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు
ఒకవేల చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు
మన మనసెరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా
మీ గర్భంలోనే రూపిస్తున్నాడు వివాహానికిదే అర్ధం దీనిలోని పరమార్ధం (2) “నిదురించె”
2 ప్రతి బహుమానం తనకొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు
వాక్యమెరుగక దేవునికై బ్రతకక నరకానికందరూ పోవుట న్యాయమా?
మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా?
మీ తరమువారికి సేవచేసి నిద్రించరా?
మనిషి జన్మకిదే అర్ధం దీనిలోనె పరమార్ధం(2) “నిదురించె”