శాస్త్రానికందని నిర్మాణమా?
9
పల్లవి: శాస్త్రానికందని నిర్మాణమా? మానవ శరీర ఆకారమా?(2)పిల్లలు కావాలని కోరుకున్నా-కలుగుట లేదు కారణమేమని? (2)
యోచించుమా ఓ మానవా నీ జన్మదినమే రహస్యమా?
అనాది దేవుని సంకల్పమా? “శాస్త్రానికందని”
1 పూతపూస్తుంది కోటానుకోట్లు
పండ్లుగ మారును వందలుగా నేలరాలును పువ్వంతా (2)
తల్లి గర్భంలో వెళ్ళిన ప్రతి కణము నేలరాలును కోట్లుగా
దేహాన్ని యిచ్చును కొన్నిటికే ఏ క్షణము కలిసిందో ఎవరికి తెలియదు
పిండముగా మారినది దేవునికే తెలుసు
నీ జన్మదినమే రహస్యమా! అనాది దేవుని సంకల్పమా! “శాస్త్రానికందని”
2 పిల్లలు కావాలని - కోరుకున్నాడు జగత్తు ముందే
ఆరు దినాలు కష్టపడి- చేశాడు సృష్టి పిల్లలకోసం (2)
తన కొరకు బ్రతకాలని - తన సేవ చేయాలని (2)
అరచేతిలో చెక్కుకొని - తన కళ్ళతో చూసుకొని
పిండమునైయుండగా - గర్భములో నుండగా “శాస్త్రానికందని”