స్తోత్రం చెల్లింతుము
2
పల్లవి: స్తోత్రం చెల్లింతుము - స్తుతి స్తోత్రం చెల్లింతుముయేసు నాధుని మేలులు తలంచి - స్తోత్రం చెల్లింతుము
1 దివారాత్రములు - కంటి పాపవలే కాచి
దయగల హస్తముతో - బ్రోచి నడిపించితివి “స్తోత్రం”
2 గాఢాంధకారములో- కన్నీటిలోయలలో
కృశించి పోనిక - కృపలతో బలపరిచితివి “స్తోత్రం”
3 సజీవయగముగా - మాన శరీరము సమర్పించి
సంపూర్ణ సిద్ధినొంద శుద్ధాత్మను నొసంగితివి“స్తోత్రం”
4 సీయోను మార్గములో - పలు శోధనలు రాగా
సాతాన్ని జయించుటకు - విశ్వాసము నిచ్చితివి “స్తోత్రం”
5 సిలువను మోసుకొని - సువార్తను చేపట్టి
యేసుని వెంబడింప - ఎంతభాగ్యము నొసగితివి “స్తోత్రం”
6 పాడెద హల్లెలూయ - మరనాత హల్లెలూయ
సదా పాడెద హల్లెలూయ - ప్రభుయేసుకు హల్లెలూయా “స్తోత్రం”