పేతురు రాసిన రెండవ పత్రిక
గ్రంథకర్త
2 పేతురు రచయిత అపోస్తలుడు పేతురు. 1:1 లో అతడు ఈ విషయం చెప్పాడు. 3:1 లో రచయిత తాను యేసు రూపాంతరం చూశానని చెప్పాడు (1:16-18). సమ దృక్పధ సువార్తల ప్రకారం యేసుతోబాటు అక్కడికి వెళ్ళిన ముగ్గురిలో పేతురు ఉన్నాడు. (మిగతా ఇద్దరూ యాకోబు, యోహాను). ఈ పత్రిక రచయిత తాను హతసాక్షిగా మరణించబోతున్నానని చెప్పాడు. యోహాను 21:18-19 లో యేసు ఈ సంగతి చెప్పాడు. పేతురు కొంతకాలం చెరలో ఉండి హతసాక్షి మరణం పొందుతాడని చెప్పాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 65 - 68
అపోస్తలుడు తన జీవిత చరమాంకం గడిపిన రోమ్ నుండి ఈ పత్రిక రాశాడు.
స్వీకర్త
మొదటి పత్రిక ఎవరికి రాసాడో ఆ ఆసియా మైనర్ లో ఉన్నవారికే ఇది కూడా రాసి ఉండవచ్చు.
ప్రయోజనం
క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రాతిపదికను వారికి జ్ఞాపకం చేయడం కోసం ఈ పత్రిక పేతురు రాశాడు (1:12-13, 16-21). అపోస్తలిక సంప్రదాయాన్ని నొక్కి చెప్పడం ద్వారా రానున్న విశ్వాసుల తరాలను పేతురు హెచ్చరిస్తున్నాడు. సమయం తక్కువగా ఉంది, దేవుని ప్రజలు అనేక ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు (1:13-14; 2:1-3). రానున్న అబద్ధ బోధకుల గురించి విస్వసులను హెచ్చరించడానికి పేతురు ఈ పత్రిక రాశాడు (2:1-22). ఆ బోధకులు ప్రభువు త్వరలో రానున్నాడనే సత్యాన్ని తిరస్కరిస్తారు (3:3-4).
ముఖ్యాంశం
అబద్ధ బోధకుల గురించి హెచ్చరిక
విభాగాలు
1. అభినందనలు — 1:1, 2
2. క్రైస్తవ సుగుణాల్లో ఎదుగుదల — 1:3-11
3. పేతురు సందేశం యొక్క ఉద్దేశం — 1:12-21
4. అబద్ధ బోధకుల గురించి హెచ్చరికలు — 2:1-22
5. క్రీస్తు రాక — 3:1-16
6. ముగింపు — 3:17, 18