ఫిలేమోనుకు రాసిన పత్రిక
గ్రంథకర్త
ఫిలేమోను గ్రంథకర్త అపోస్తలుడు పౌలు (ఫిలేమోను 1:1). ఈ పత్రికలో పౌలు తాను ఒనేసిమును తిరిగి ఫిలేమోను దగ్గరికి పంపుతున్నానని చెప్పాడు. కొలోస్సి 4:9 లో తుకికుతో (కొలోస్సి పత్రికను ఆ సంఘానికి అందజేసే సహోదరుడు) కలిసి కోలోస్సయికి ఈ ఒనేసిము వస్తున్నాడని రాసి ఉంది. ఇది తన దృష్టిలో ఎంత ప్రముఖ్యమో చెప్పడానికి పౌలు తన స్వదస్తూరీతో ఈ లేఖ రాసాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 59 - 62
పౌలు రోమ్ నుండి ఫిలేమోనుకు ఈ పత్రిక రాశాడు. ఆ సమయంలో పౌలు ఖైదులో ఉన్నాడు.
స్వీకర్త
పౌలు ఈ పత్రిక ఫిలేమోనుకు, అప్పియకు, అర్ఖిప్పుకు, వారి ఇంట్లో సమకూడే సంఘానికీ రాశాడు. ఇందులోని విషయాన్నీ బట్టి ముఖ్యంగా ఫిలేమోను కోసం రాశాడు.
ప్రయోజనం
ఒనేసిమును (ఫిలేమోను ఇంట్లో దొంగతనం చేసి పారి పోయిన బానిస) ఎలాటి అపరాధ శిక్ష లేకుండా (10-12, 17) తిరిగి చేర్చుకోవలసిందని ఫిలేమోనును అభ్యర్థించడం లేఖ ముఖ్యోద్దేశం. అంతేగాక ఒనేసిమును బానిసగా కాక ప్రియ సోదరునిగా (15-16) అంగీకరించమని పౌలు కోరాడు. ఒనేసిము ఇప్పటికీ ఫిలేమోను బానిసే. అతడు తన యజమాని దగ్గరికి వెళ్ళడం సరళంగా జరగడం కోసం పౌలు రాశాడు. పౌలు చెప్పిన సువార్త మూలంగా ఒనేసిము క్రైస్తవుడయ్యాడు (వ. 10).
ముఖ్యాంశం
క్షమ
విభాగాలు
1. అభివాదం — 1:1-3
2. కృతజ్ఞత — 1:4-7
3. ఒనేసిము పక్షంగా వేడికోలు — 1:8-22
4. అంతిమ వాక్కులు — 1:23-25