తిమోతికి రాసిన రెండవ పత్రిక
గ్రంథకర్త
రోమ్ లో చెర తరువాత పౌలు తన నాలుగవ సువార్త ప్రయాణంలో తిమోతికి మొదటి పత్రిక రాశాడు. ఆపైన అతణ్ణి నీరో పరిపాలన సమయంలో మరొక సారి జైల్లో పెట్టారు. అక్కడ పోలులు ఈ రెండవ పత్రిక రాశాడు. మొదటి చెరలో పోలులు ఒక అద్దె ఇంట్లో గృహ నిర్బంధంలో (అపో. కా. 28:30) ఉన్నాడు. రెండవ చెర కాలంలో అందుకు భిన్నంగా ఒక చీకటి ఖైదులో (4:13) సామాన్య నేరస్థుని వలె గొలుసుల్లో (1:16; 2:9) మగ్గిపోయాడు. తాను నెరవేర్చవలసిన పని పూర్తి అయిందని, తన జీవితం చరమ దశకు చేరుకున్నదని అతనికి తెలుసు (4:6-8).
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 66 - 67
పౌలు రోమ్ లో తన రెండవ సారి చెరలో ఉన్నాడు. తన మరణ శిక్ష కోసం ఎదురు చూస్తూ ఈ లేఖ రాశాడు.
స్వీకర్త
ముఖ్య గ్రహీత తిమోతి. అయితే తప్పని సరిగా ఈ పత్రికలోని సంగతులు ఇతరులకు కూడా చెప్పి ఉంటాడు.
ప్రయోజనం
పౌలు తిమోతికి అప్పగించిన పనిని కొనసాగించడానికి అతనికి అవసరమైన అంతిమ ప్రోత్సాహం, హెచ్చరిక ఇవ్వడం. తిమోతి ధైర్యంతో (1:3-14), ఏకాగ్రతతో (2:1-26), పట్టుదలగా ఈ పని చెయ్యాలి (3:14-17; 4:1-8).
ముఖ్యాంశం
నమ్మకమైన పరిచర్యకై ఆజ్ఞ.
విభాగాలు
1. మంత్రిత్వ శాఖకు ప్రేరణ — 1:1-18
2. పరిచర్యలో మోడల్ — 2:1-26
3. తప్పుడు బోధనకు వ్యతిరేకంగా హెచ్చరిక — 3:1-17
4. ప్రోత్సాహం పలికిన పదాలు — 4:1-22