మలాకీ
గ్రంథకర్త
గ్రంథ కర్త మలాకీగా 1:1 గుర్తిస్తున్నది. హీబ్రూలో ఈ పదం వార్తాహరుడు అనే అర్థమిచ్చే పదం నుండి పుట్టింది. దేవుని ప్రవక్తగా మలాకీ పాత్రను ఇది చూపుతున్నది. దేవుని ప్రజలకు అతడు దైవ సందేశాలు వినిపించాడు. రెండవ రకంగా మలాకీ అంటే మనకు ఈ పుస్తకాన్ని అందిస్తున్నవాడు. అతని సందేశం ఏమిటంటే భావికాలంలో దేవుడు మరొక ప్రవక్తను పంపుతాడు. యెహోవా దినానికి ముందు మహా ప్రవక్త ఏలీయా తిరిగి వస్తాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 450 - 400
ఇది చెర అనంతర గ్రంధం. అంటే యూదులు బబులోను చెరనుండి తిరిగి వచ్చాక రాసిన పుస్తకం.
స్వీకర్త
యేరుషలేము యూదులకు, మరింత విస్తృతంగా అంతటా దేవుని ప్రజలు.
ప్రయోజనం
దేవుడు తన ప్రజల కోసం చేయవలసినదంతా చేస్తాడు. తాను తీర్పరిగా వారి పనుల నిమిత్తం సంజాయిషీ అడుగుతాడు. ఈ రెండు సంగతులు ప్రవక్త ఆ ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. నిబంధన దీవెనలు నెరవేరాలంటే వారు తమ దుష్టత్వం విషయం పశ్చాత్తాపపడాలి. ఇది మలాకీ ద్వారా తన ప్రజలకు దేవుని సందేశం. వారు తిరిగి దేవుని వైపు మళ్ళుకోవాలి. పాత నిబంధన చివరి పుస్తకం ముగింపులో దేవుని న్యాయం గురించి ప్రకటన, రానున్న మెస్సీయ ద్వారా వారికి పూర్వ క్షేమ స్థితిని కలుగుతుందనే ఆశాభావం కనిపిస్తున్నాయి.
ముఖ్యాంశం
ఆచార భక్తి విషయంలో గద్దింపు
విభాగాలు
1. దేవునికి ఘనత కలిగించాలని యాజకులకు ప్రోత్సాహం — 1:1-2:9
2. దేవునికి నమ్మకంగా ఉండాలని యూదాకు ప్రోత్సాహం — 2:10-3:6
3. దేవుని వైపుకు మళ్ళుకోవలసిందని యూదాకు ప్రోత్సాహం — 3:7-4:6