5
1 మీలో సంఘం పెద్దలకు✽ సాటి పెద్దనూ క్రీస్తు బాధలను చూచినవాణ్ణీ✽ వెల్లడి కాబోయే మహిమలో✽ పాలివాణ్ణీ అయిన నేను ఈ ప్రోత్సాహం ఇస్తున్నాను: 2 ✽మీదగ్గర ఉన్న దేవుని మందకు కాపరులుగా✽ ఉండండి. బలవంతంగా కాకుండా, ఇష్టపూర్వకంగానే, దుర్లాభం✽ కావాలని కాదు గాని ఆసక్తితో✽ నాయకులుగా సేవ చేయండి. 3 మీ బాధ్యత క్రింద ఉంచబడ్డవారిమీద ప్రభువులాగా✽ ఉండకుండా మందకు ఆదర్శంగా✽ ఉండండి. 4 ప్రముఖ కాపరి కనిపించేటప్పుడు✽ మీకు వాడిపోని✽ మహిమ కిరీటం✽ లభిస్తుంది.5 యువకులారా, మీరు పెద్దలకు లోబడి✽ ఉండండి. మీరంతా ఒకరికొకరు లోబడి ఉంటూ వినయం✽ వస్త్రంలాగా ధరించుకోండి. ఎందుకంటే, “దేవుడు గర్విష్ఠులను✽ ఎదిరిస్తాడు గాని వినయం గలవారికి కృప చూపుతాడు.” 6 ✝అందుచేత దేవుడు తగిన సమయంలో✽ మిమ్ములను పై స్థితికి తెచ్చేలా ఆయన బలిష్ఠమైన చేతిక్రింద మిమ్ములను మీరే తగ్గించుకోండి. 7 ✝ఆయన మీ విషయం పట్టించుకొంటున్నాడు✽ గనుక మీ చింత యావత్తూ ఆయనమీద వేయండి.
8 స్థిరబుద్ధి✽ కలిగి మెళకువ✽గా ఉండండి. ఎందుకంటే, మీ విరోధి అయిన అపనింద పిశాచం✽ గర్జిస్తున్న సింహంలాగా ఎవరినైనా మ్రింగివేయడానికి వెదకుతూ తిరుగులాడుతున్నాడు. 9 నమ్మకంలో స్థిరులై వాణ్ణి ఎదిరించండి✽. ఈ లోకంలో ఉన్న మీ క్రైస్తవ సోదరులకు ఇలాంటి బాధలే✽ కలుగుతున్నాయని మీకు తెలుసు గదా. 10 మీరు కొద్ది కాలం బాధలు అనుభవించిన తరువాత✽, సర్వ కృపానిధి✽ అయిన దేవుడు – క్రీస్తు యేసు ద్వారా✽ తన శాశ్వత మహిమకు✽ మనలను పిలిచిన✽ దేవుడు – మిమ్ములను పరిపూర్ణులుగా చేసి దృఢపరుస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. 11 ఆయనకే మహిమ అధికారం✽ యుగయుగాలకు ఉంటుంది గాక! తథాస్తు.
12 నమ్మకమైన సోదరుడని నేను ఎంచిన సిల్వానస్✽ సహాయం✽తో నేను క్లుప్తంగా రాస్తూ మిమ్ములను ప్రోత్సాహపరుస్తూ, మీరు ఏ కృపలో నిలిచి ఉన్నారో✽ అది దేవుని నిజమైన కృప అని సాక్ష్యం చెపుతున్నాను.