6
1 ✝దేవుని పేరు, ఆయన ఉపదేశం దూషణపాలు✽ కాకుండా బానిసత్వం అనే కాడిక్రింద ఉన్నవారంతా తమ యజమానులు పూర్తి మర్యాదకు తగినవారని ఎంచాలి. 2 ✽విశ్వాసులైన యజమానుల క్రింద ఉన్న బానిసలు, వారు సోదరులని✽ చెప్పి వారిని చిన్నచూపు చూడకూడదు. దానికి బదులు, తమ సేవవల్ల ప్రయోజనం పొందేవారు విశ్వాసులనీ ప్రియమైన✽వారనీ సేవ చేయాలి. ఈ సంగతులు ఉపదేశిస్తూ వారిని ప్రోత్సాహపరచు.3 ✽ఎవరైనా సరే క్షేమకరమైన మాటలు – మన ప్రభువైన యేసు క్రీస్తు మాటలు – దైవభక్తికి అనుగుణమైన ఉపదేశం అంగీకరించకుండా, వేరే ఉపదేశం ఇస్తారనుకో, 4 అలాంటివాడు ఏమీ తెలియని గర్విష్ఠి. ఆ వ్యక్తికి తర్కాలలో వితండ వాదాలలో వెర్రి పట్టింపు✽ ఉంది. వీటివల్ల అసూయ, కలహం, దూషణలు, చెడ్డ అపోహలు కలుగుతాయి. 5 భ్రష్ట మనసు✽ కలిగి సత్యం కోల్పోయిన✽ మనుషుల వ్యర్ధమైన జగడాలు ఇవి. ఇలాంటివారు దైవభక్తివల్ల తమకు ఆర్థిక లాభం చేకూరుతుందని తలస్తారు. వీరి దగ్గరనుంచి వేరై ఉండు. 6 ✽ ఉన్నదాన్ని గురించి తృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభమే. 7 ✽ ఎందుకంటే, మనం లోకంలోకి దేనినీ తీసుకురాలేదు, లోకంనుంచి దేనినీ తీసుకుపోలేమని స్పష్టమే. 8 ✽అందుచేత మనకు అన్నవస్త్రాలు ఉంటే వాటితోనే తృప్తిపడతాం.
9 ✽ధనవంతులు కావడానికి ఆశించేవారు విషమ పరీక్షలో, ఉరిలో, హానికరమైన అనేక వెర్రి కోరికలలో చిక్కుపడతారు. అలాంటి కోరికలు మనుషులను విధ్వంసంలో, వినాశంలో ముంచివేస్తాయి. 10 ✽ఎందుకంటే డబ్బుమీది వ్యామోహం అన్ని రకాల కీడులకు మూలం. కొందరు డబ్బు చేజిక్కించు కొందామని విశ్వాస సత్యాలనుంచి తొలగిపోయి,✽ అనేక అగచాట్లతో✽ తమను తామే గుచ్చుకొన్నారు.
11 ✽దేవుని మనిషీ! నీవైతే ఆ కోరికలనుంచి పారిపో! నీతిన్యాయాలను, దైవభక్తిని, నమ్మకాన్ని, దైవిక ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని అనుసరించు. 12 విశ్వాసాన్ని గురించిన మంచి పోరాటం✽ పోరాడుతూ ఉండు. శాశ్వత జీవాన్ని✽ చేపట్టు✽. నీకు పిలుపు అందినది దానికే. అనేక సాక్షుల సముఖంలో ఆ మంచి సంగతి ఒప్పుకొన్నావు.✽
13 ✝సమస్తానికి జీవం పోసే✽ దేవుని సమక్షంలో, పొంతి పిలాతు✽ ఎదుట మంచి సాక్ష్యం చెప్పిన క్రీస్తు యేసు సమక్షంలో నీకు ఈ ఆదేశం ఇస్తున్నాను: 14 మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షం✽ అయ్యేవరకు ఈ ఆజ్ఞ✽ను నిష్కళంకంగా అనింద్యంగా పాటించు.
15 ✽ఏకైక దివ్య పరిపాలకుడైనవాడు సరైన సమయం✽లో ఆ ప్రత్యక్షం జరిగిస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 16 ✝ఎవ్వరూ సమీపించలేనంతటి వెలుగు✽లో నివసించే అమర్థ్యుడు ఆయన మాత్రమే. ఆయనను ఏ మనిషీ చూడలేదు, చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వత ప్రభావం ఉంటాయి గాక! తథాస్తు.
17 ✽ఇహలోకంలో ధనం ఉన్నవారు గర్విష్ఠులు కాకుండా అనిశ్చయమైన✽ ధనంమీద నమ్మకం పెట్టుకోకుండా, జీవంగల దేవునిమీదే నమ్మకం ఉంచాలని వారిని ఆదేశించు. సంతోషంతో అనుభవించడానికి✽ ఆయన అన్నీ సమృద్ధిగా దయ చేసేవాడు✽. 18 ✝వారు మేలు చేస్తూ ఉండాలి. మంచి పనులు చేయడంలో ఆధ్యాత్మిక ధనం గలవారై✽, ఔదార్యంతో ఇతరులకు ఇచ్చే మనసు గలవారై, తమకున్న దానిలో కొంత పంచిపెట్టడానికి✽ సిద్ధంగా ఉండి, 19 వచ్చే యుగం కోసం మంచి పునాదికి చెందిన దాన్ని సమకూర్చుకొంటూ ఉండాలి. వారు శాశ్వత జీవాన్ని✽ చేపట్టాలన్న మాట.