16
1 ✽ పవిత్రులకోసం చందా విషయమైతే, నేను గలతీయ ప్రాంతం సంఘాలను ఆదేశించినట్టు మీరూ చేయాలి. 2 నేను వచ్చేటప్పుడు చందా ఎత్తకుండా మీలో ఒక్కొక్కరు తాను వర్ధిల్లినకొలది కొంత డబ్బు మిగిల్చి ప్రతి ఆదివారమూ✽ కూడబెట్టాలి. 3 ✽నేను వచ్చినప్పుడు మీరు ఉత్తరాల ద్వారా ఎవరిని ఆమోదిస్తారో నేను వారిచేత మీ ఈవి జెరుసలంకు పంపుతాను. 4 ఒకవేళ నేను కూడా అక్కడికి వెళ్ళడం యుక్తమైతే వారు నాతో కలిసి వెళ్తారు.5 కాని, నేను మాసిదోనియ✽ ప్రాంతంగుండా ప్రయాణం చేస్తాను. మాసిదోనియగుండా ప్రయాణించి మీ దగ్గరికి వస్తాను. 6 అప్పుడు ఒకవేళ మీతో కొంత కాలం ఉంటాను. లేదా, చలికాలమంతా గడపవచ్చు. తరువాత నేను ఎక్కడికైనా వెళ్ళితే నా ప్రయాణంలో మీరు నన్ను సాగనంపవచ్చు✽. 7 ప్రభువు అనుమతి ఇస్తే మీతో కొంత కాలం ఉండాలని ఆశతో ఎదురు చూస్తున్నాను గనుక ఇప్పుడు ప్రయాణంలో మిమ్ములను సందర్శించడానికి నాకిష్టం లేదు. 8 కాని, పెంతెకొస్తు పండుగ వరకు ఎఫెసులో ఉండిపోతాను. 9 ఎందుకంటే, కార్యసాధకమైన గొప్ప ద్వారం✽ నాకు తెరచి ఉంది. అయినా ఎదురాడేవారు చాలామంది.
10 ఒకవేళ తిమోతి✽ మీ దగ్గరికి వస్తే మీ దగ్గర ఉన్నప్పుడు అతడు నిర్భయం✽గా ఉండేలా చూచుకోండి. నాలాగే అతడు కూడా ప్రభు సేవ చేస్తున్నాడు. 11 అందుచేత ఎవరూ అతణ్ణి చిన్న చూపు చూడకూడదు. నా దగ్గరకు వచ్చేలా అతణ్ణి శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో వస్తాడని ఎదురు చూస్తున్నాను.
12 సోదరుడైన అపొల్లో✽ విషయమేమిటంటే, అతణ్ణి ఆ సోదరులతో మీ దగ్గరకు వెళ్ళమని మరీమరీ వేడుకొన్నాను గాని ఇప్పుడు వెళ్ళడానికి అతనికి ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు.
13 మెళుకువగా✽ ఉండండి. విశ్వాస సత్యాలలో నిలకడ✽గా ఉండండి. పౌరుషంగా ఉండండి. బలంగా✽ ఉండండి. 14 మీరు చేసేదంతా ప్రేమతో✽ చేయండి. 15 ✽స్తెఫనస్ ఇంటివారు అకయ ప్రాంతంలో ప్రథమ ఫలమని, పవిత్రులకు పరిచర్య✽ చేయడానికి తమను అప్పగించుకొన్నారనీ మీకు తెలుసు. 16 సోదరులారా, అలాంటివారికీ, మనతో పనిలో తోడ్పడుతూ ప్రయాసపడుతూ ఉండేవారందరికీ అణిగిమణిగి ఉండాలని మిమ్ములను వేడుకొంటున్నాను. 17 స్తెఫనస్, ఫొర్‌టునాటన్, అకైకస్ వచ్చినందుచేత సంతోషించాను. ఎందుకంటే మీరు లేని కొరత✽ వీరు తీర్చారు. 18 ✽నా ప్రాణానికీ, మీ ప్రాణానికీ సేద తీర్చారు. అలాంటివారిని గుర్తించి గౌరవించండి.
19 ✽ఆసియా రాష్ట్రం లో ఉన్న క్రీస్తు సంఘాలు మీకు అభివందనాలు చెపుతున్నాయి. అకుల, ప్రిస్కిల్ల✽, వారి ఇంట్లో✽ ఉన్న సంఘం కూడా ప్రభువులో మనస్ఫూర్తిగా అభివందనాలు చెపుతున్నారు. 20 సోదరులంతా మీకు అభివందనాలు చెపుతున్నారు. పవిత్రమైన ముద్దు✽పెట్టుకొని మీరు ఒకరినొకరు అభివందనాలు చెప్పుకోండి. 21 ✽ఈ అభివందనం నేను – పౌలును – నా సొంత చేతితో రాస్తున్నాను. 22 ✽ఎవరికైనా సరే ప్రభువైన యేసు క్రీస్తంటే ప్రేమ లేకపోతే వారు శాపానికి గురి అవుతారు గాక! ప్రభువు వస్తున్నాడు✽!