మత్తయి శుభవార్త
1
1 ✽ఇది యేసు క్రీస్తు వంశావళి లేఖనం. ఆయన దావీదు కుమారుడు అబ్రాహాము కుమారుడు. 2 అబ్రాహాము కుమారుడు ఇస్సాకు✽. ఇస్సాకు కుమారుడు యాకోబు✽. యాకోబు కుమారులు యూదా, అతడి అన్నదమ్ములు✽. 3 యూదా కుమారులు పెరెసు, జెరహు. వారి తల్లి తామారు✽. పెరెసు కుమారుడు ఎస్రోన్. ఎస్రోన్ కుమారుడు ఆరామ్✽. 4 ఆరామ్ కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను. 5 శల్మాను కుమారుడు బోయజు. బోయజు తల్లి రాహాబు✽. బోయజు కుమారుడు ఓబేదు, ఓబేదు తల్లి రూతు✽. ఓబేదు కుమారుడు యెష్షయి. 6 యెష్షయి కుమారుడు దావీదురాజు.దావీదు✽ కుమారుడు సొలొమోను✽. సొలొమోను తల్లి మొదట ఉరియా భార్య✽. 7 సొలొమోను కుమారుడు రెహబాం. రెహబాం కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా. 8 ✽ఆసా కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు కుమారుడు యెహోరాం. యెహోరాం కుమారుడు ఉజ్జీయా. 9 ఉజ్జీయా కుమారుడు యోతాం. యోతాం కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా. 10 హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు యోషీయా. 11 ✽యోషీయా కుమారులు యెకొన్యా, అతడి సోదరులు. వారి కాలంలో యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగింది.
12 యూదులను బబులోనుకు తీసుకువెళ్ళడం జరిగిన తరువాత వీరు జన్మించారు: యెకొన్యా కుమారుడు షయల్‌తీయేల్. షయల్‌తీయేల్ కుమారుడు జెరుబ్బాబెల్. 13 జెరుబ్బాబెల్ కుమారుడు అబీహూదు. అబీహూదు కుమారుడు ఎల్యాకీం. ఎల్యాకీం కుమారుడు అజోరు. 14 అజోరు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అకీం. అకీం కుమారుడు ఏలీహూదు. 15 ఏలీహూదు కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు మత్తాను. మత్తాను కుమారుడు యాకోబు. 16 ✽యాకోబు కుమారుడు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమెకు యేసు జన్మించాడు. యేసు బిరుదం “క్రీస్తు”.
17 ఈ విధంగా అబ్రాహామునుంచి దావీదువరకు పధ్నాలుగు తరాలు; దావీదు కాలంనుంచి యూదులను బబులోనుకు తీసుకువెళ్ళిన✽ కాలంవరకు పధ్నాలుగు తరాలు; బబులోనుకు తీసుకువెళ్ళిన కాలంనుంచి క్రీస్తువరకు పధ్నాలుగు తరాలు.
18 ✽ఇది యేసు క్రీస్తు జన్మ వివరణ: ఆయన తల్లి అయిన మరియకు యోసేపుతో వివాహం నిశ్చయం అయింది గాని వారు ఏకం కాకముందే ఆమె పవిత్రాత్మ✽ మూలంగా గర్భవతి అని కనబడింది. 19 ఆమె భర్త యోసేపు న్యాయవంతుడు✽, గనుక ఆమెను బహిరంగ అవమానానికి గురి చేయడం ఇష్టం లేక రహస్యంగా ఆమెతో తెగతెంపులు చేసుకోవాలనుకొన్నాడు. 20 ✽అతడు ఈ విషయాల గురించి తలపోస్తూ ఉంటే, ప్రభు దేవదూత ఒకడు అతనికి కలలో కనబడి ఇలా అన్నాడు: “యోసేపు! దావీదు కుమారా! మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడకు. ఎందుకంటే ఆమె గర్భధారణ పవిత్రాత్మ మూలంగా కలిగింది. 21 ఆమెకు కుమారుడు జన్మిస్తాడు. ఆయన తన ప్రజలను వారి పాపాలనుంచి విడిపించి రక్షిస్తాడు, గనుక ఆయనకు యేసు✽ అనే పేరు పెట్టాలి.”
22 ✽ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాట నెరవేరాలని ఇదంతా జరిగింది: 23 “ఇదిగో వినండి, ఒక కన్య గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుంది. ఆయనకు ‘ఇమ్మానుయేల్✽’ అని నామకరణం చేస్తారు.” ఇమ్మానుయేల్ అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం.
24 ✽యోసేపు నిద్ర మేలుకొని తనకు ఆ దేవదూత ఆదేశించినట్టే మరియను తన భార్యగా స్వీకరించాడు. 25 అయితే ఆమె జ్యేష్ఠ కుమారుణ్ణి కనేంతవరకు అతడు ఆమెను ముట్టలేదు. అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు.